News

అలరించిన అయోధ్య కాండ నాటకం

131views

భారత రంగస్థల మహోత్సవ్భాగంగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఆదివారం ప్రదర్శించిన అయోధ్యకాండ నాటకం ప్రేక్షకులను అలరించింది. రామాయణం అనగానే కిరీటాలు, ఆభరణాలు, సింహాసనాలు, రాణిమందిరాలు తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వస్తాయి. అటువంటివి లేకుండా నాటి సంస్కృతిని ప్రతిబింబించే విధంగా పాత్రధారులే గాత్రధారులై అయోధ్యకాండ నాటకాన్ని ప్రదర్శించారు. నటులు ప్రదీప్, పద్మశ్రీ, రాజ్యలక్ష్మి, అనూష్ షెట్టి, సుందర్ష్, విశ్వాష్ నటించారు. ప్రసన్న దర్శకత్వం వహించారు. ఈ నెల 6 నుంచి 11 వరకు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో ఆరు విభిన్న నాటకాలను ప్రదర్శించడంతో కళాక్షేత్రంలో రంగస్థల మహోత్సవ్ ముగిసింది. కార్యక్రమంలో ఎన్ఎస్ఈ ప్రతినిధులు మల్లికార్జునరావు, వివేక్ పాల్గొన్నారు.