మాఘ మాసాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక సూర్యో పాసన పూజలను ఆదివారం ప్రారంభించారు. మల్లికార్జున మహామండపం ఏడో అంతస్తులోని ధర్మపథం స్టేజీపై సూర్యభగవానుడి చిత్రపటా నికి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య రుత్వికులు పూజలు నిర్వహించారు. అరుణ పారాయణ, మంత్ర సహిత సూర్య నమస్కా రాలు నిర్వహించారు. పూజలో పాల్గొన్న ఉభయ దాతలకు దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాద లతో అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదాలు అందజేశారు.
* దర్శనానికి పోటెత్తిన భక్తులు.. మాఘమాసం తొలి రోజున దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటె త్తారు. ఘాట్ రోడ్డు, కనకదుర్గానగర్ మెట్ల మార్గం భక్తులతో కిటకిటలాడింది. లక్ష కుంకు మార్చన, చండీయాగం, శ్రీచక్ర నవావర్ణార్చన, ఖడ్గమాలా కుంకుమార్చన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దుర్గమ్మ దర్శనానికి వీఐపీ క్యూలైన్లో గంటన్నర సమయం పట్టింది. ఉచిత దర్శనానికి రెండున్నర గంటల సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు.