NewsSeva

నంద్యాల లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో స్వచ్ఛ మందిర్ కార్యక్రమం

234views

అయోధ్య రామ మందిరం ప్రతిష్ట సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు నంద్యాల జిల్లా, సంఘమిత్ర (సేవాభారతి) ఆధ్వర్యంలో స్వచ్చ భారత్ – స్వచ్చ గుడి కార్యక్రమాన్ని నిర్వహించారు.

స్థానిక నూనెపల్లె హరిజన పేటలో కొలువైవున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో సంఘమిత్ర ఆవాసం విద్యార్థులు మరియు అభ్యాసిక విద్యార్థులు దేవాలయ శుద్ధి, స్వచ్చతా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈనెల 22న జరిగే అయోధ్య బాలరాముడు విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు స్వచ్ఛత అభ్యాన్ కార్యక్రమంలో భాగంగా మన ప్రాంతంలోని ఆలయాలను శుభ్రపరచుకొని 22న ఒక పండగ వాతావరణంలా మలుచుకొని ఆరోజు ప్రతి ఇంటిలోనూ, దేవాలయాల్లో దీప ప్రమిదలను వెలిగించి శ్రీరామ నామ జపం చేయాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో సంఘమిత్ర కార్యదర్శి చిలుకూరి శ్రీనివాస్, కోశాదికారి నాగరాజయ్య, ఉపాధ్యక్షులు శ్రీనివాస పాండే, కార్యవర్గ సభ్యులు వివి రమణయ్య గౌడ్, శారదా విద్యా పీఠం ప్రధానాచార్యలు నారాయణ, స్థానిక పెద్దలు శేషగిరిరావు , సేవా ప్రముఖ్ శ్రీనివాస్, అభ్యాసిక టీచర్ కుమారి పుష్ప తదతరులు పాల్గొన్నారు.