News

వైభవంగా నారాయణస్వామి పుష్పయాగం

170views

ప్రకాశం జిల్లాలో ప్రసిద్దిగాంచిన మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో స్వామివారికి మహాపుష్పయాగం ఆదివారం వైభవంగా జరిగింది. కార్తికమాసం సందర్భంగా నారాయణస్వామి ఆలయంలో మహాపుష్పయాగం ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. నారాయణస్వామి మూలవిరాట్టును వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరించారు. ఆలయం ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి, విష్ణుమూర్తి, నారాయణస్వామి ఉత్సవమూర్తులకు వేద పండితులు మహాపుష్పయాగాన్ని నిర్వహించారు. భక్తులు నారాయణ నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దాతల సహకారంతో భక్తులకు అల్పహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్‌ కొమ్మినేని చినఆదినారాయణ, ఆవో జి.రమణారెడ్డి, పాలక మండలి సభ్యులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.