188
పవిత్ర కార్తిక మాసంలో నిర్వహించే కార్తిక వనభోజన మహోత్సవంలో భాగంగా ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా శ్రీమలయప్పస్వామివారు, ఉభయనాంచారులను ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి తీసుకువచ్చారు. అనంతరం ఉత్సవర్లకు విశేష అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో జీయంగార్లు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.