News

అయ్యప్ప భక్తులపై ముస్లిం వ్యక్తి దుశ్చర్య

159views

అయ్యప్ప మాలధారులు ఎంత నిష్టతో ఉంటారో మనకు తెలిసిందే. దీక్ష పూని ఆ శబరి గిరీశుడిని దర్శించుకునేందుకు వెళుతున్న అయ్యప్ప భక్తులను అవమానించే రీతిలో ఓ వ్యక్తి దుశ్చర్యకు పాల్పడ్డాడు.కేరళలోని ఎరుమేలిలో టీ దుకాణం నడుపుతున్న వ్యక్తి తన వద్దకు వచ్చే అయ్యప్ప భక్తులకు మరుగుదొడ్డి నీటితో తయారు చేసిన టీ, పళ్ల రసాలను అందిస్తున్నాడు. విజిలెన్స్ బృందం నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా శబరిమల ఆలయానికి వెళ్లే సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం.

ఎరుమేలిలోని దేవస్వం బోర్డ్ పార్కింగ్ స్థలం సమీపంలోని దుకాణంలో పానీయాలు దుర్గంధం వెదజల్లుతున్నాయని అయ్యప్ప భక్తులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన రెవెన్యూ శాఖ అధికారులు దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. దుకాణదారుడు ఎటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో పాటు సమీపంలోని మరుగుదొడ్లలోని నీటిని దుకాణంలో వాడుతున్నట్లు గుర్తించారు. మరుగుదొడ్ల నుంచి తన దుకాణానికి అతడు పైప్ లైన్ ఏర్పాటు చేసుకోవడం చూసి అధికారులు సైతం విస్తుపోయారు.

దుకాణదారుడు డివైఎఫ్ఐకి చెందిన స్థానిక నేత అబ్దుల్ షెహీమ్‌గా అధికారులు గుర్తించారు. నాణ్యతా ప్రమాణాలపై ప్రశ్నించగా మరుగుదొడ్ల నుంచి సరఫరా అయ్యే నీటితో పాత్రలను కడుగుతున్నామని తెలిపాడు. అయితే వంట చేసేందుకు కూడా ఇదే నీటిని వాడుతున్నట్లు అధికారుల విచారణలో నిగ్గు తేలింది. ఈ ఘటనపై అయ్యప్ప భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ మనోభావాలు దెబ్బ తినే విధంగా వ్యవహరించిన దుకాణదారుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Source : HinduPost