News

కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న టీమిండియా దిగ్గజాలు

136views

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. స్వామివారికి అభిషేకం చేసి భక్తిభావం చాటుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రాత్మక నగరం వారణాసిలో అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ స్టేడియానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాని తో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సచిన్ టెండుల్కర్‌తో సహా దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, బీసీసీఐ కార్యదర్శి జై షా విశ్వనాథుడిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.