News

వినాయక ఉత్సవాలలో గణేశుడికి నైవేద్యంగా బంగారు కుడుములు

153views

వినాయక చవితి వేళ విఘ్ననాధుడికి భక్తులు రకరకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు.ఇందులో భాగంగా మహారాష్ట్రలోని నాసిక్‌లో లభిస్తున్న బంగారు కుడుములు (మోదక్‌లు) అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 24 క్యారెట్ల బంగారు పూతతో తయారుచేసిన ఈ కుడుములను కిలో రూ.16 వేలకు వర్తకులు అమ్ముతున్నారు. రూ.1,600 ధరతో వెండి కుడుములను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. బంగారు, వెండి కుడుములకు మార్కెట్లో మంచి డిమాండు ఉందని, ఇప్పటికే పెద్దమొత్తంలో అమ్మకాలు సాగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.