
71views
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుజిల్లాలో 195కుపైగా తాలూకాల్లో కరువు పరిస్థితులు నెలకొని ఉండడం, కావేరి జలవివాదం నేపథ్యంలో ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలను ఈసారి సాదాసీదాగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.దసరా ఉత్సవాలను వైభవోపేతంగా జరపాలని అంతకుముందు నిర్ణయించిన ప్రభుత్వం తాజా పరిణామాలతో వెనక్కి తగ్గింది. వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో అనుకోని కారణాలతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మైసూరు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి డాక్టర్ హెచ్‌సీ మహదేవప్ప శుక్రవారం ట్వీట్ చేశారు. . జంబూ సవారీని నిర్వహించే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.