News

ఆలయ సంపద దొంగల జేబులో, అధికారులు నిద్రావ్యవస్ధలో

132views

కొల్లేరు గ్రామాల కట్టుబాట్ల అవకాశంగా తీసుకొని దేవుడి సొమ్ము ఆరగించారు. ఆలయానికి రావాల్సిన ఆదాయాన్ని దొడ్డిదారిన జేబులను నింపుకునేందుకు కొంత మంది వ్యూహరచన చేశారు. ఇంత తంతు జరుగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం ప్రేక్షక పాత్ర పోషించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.40 ఎకరాల చేపల చెరువు వేలంలో రూ.80 లక్షల స్వాహా

మండవల్లి, మే 12: కొల్లేరు గ్రామాల కట్టుబాట్ల మధ్య దేవుడి సొమ్ముకు శఠగోపం పెట్టేశారు. ఆలయానికి రావాల్సిన ఆదాయాన్ని దొడ్డిదారిన జేబులను నింపుకునేందుకు కొంత మంది వ్యూహరచన చేశారు. ఇంత తంతు జరుగు తున్నా అధికార యంత్రాంగం మాత్రం ప్రేక్షక పాత్ర పోషించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కైకలూరు మండలంలోని కైకలూరు శ్యామలాంబ అమ్మ వారు, ఆలయంలో వున్న కనకలింగేశ్వర స్వామికి చెందిన 40 ఎకరాల చేపల చెరువు మండవల్లి మండలం చింతపాడు లో ఉంది. ఈ చెరువు మూడేళ్ల కాలపరిమితికి దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నారు. ఈ భూములు కొల్లేరు ప్రాంతంలో ఉండడం వల్ల ఆ గ్రామాల కట్టుబాట్ల మధ్య ఎవరిని వేలం పాటల్లో పాల్గొనేందుకు ఆవకాశం లేకుండా చేశారు. ఈ చెరువుల ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి, దీపదూప నైవేద్యాలకు వినియోగిస్తారు. ఆలయానికి చెందిన చేపల చెరువులపై అక్రమార్కుల కన్ను పడి దేవుడి సొమ్మును కాజేసేందుకు వెనుకంజ వేయడం లేదని ఆ గ్రామంలో సైతం విమర్శలు వ్యక్తం అవుతున్నా యి. కొల్లేరు గ్రామ కట్టుబాట్ల మధ్య దర్జాగా లక్షల్లో సొమ్ము స్వాహా చేశా రు. ఆలయానికి చెందిన భూములు ఒక ఎకరానికి రూ.31 వేలు లీజుకు ఒక వ్యక్తి పాడుకు న్నాడు. అనంతరం ఆ వ్యకి గ్రామంలో మరోసారి బహి రంగ వేలం పాట నిర్వహించగా లక్షా వెయ్యి రూపా యలకు ఒక ఎకరానికి లీజు ఇచ్చేలా వేరొకరు పాడుకు న్నారు. బహిరంగ మార్కెట్‌లో ఎకరం లక్ష రూపాయల లీజు పలుకుతున్నప్పటికీ, కట్టుబాట్ల మధ్యలో అమ్మవారు, స్వామివారికి చెందిన ఆదాయాన్ని గండికొట్టి దొడ్డిదారిన లక్షల్లో స్వాహా చేశారు. గత ఏడాది ఈ చెరువులను ఎండో మెంట్‌ అధికారులు పాటలను నిర్వహించగా ఎకరానికి రూ.50 వేలు లీజు ఇచ్చేటట్టు వేలం పాటలో పాడుకున్నా రు. గతంలో వచ్చిన దానికంటే ఈ ఏడాది రూ.50 వేలకు మరో 10 శాతం జత చేసి రూ.55 వేల నుంచి పాట నిర్వ హించాల్సి ఉంది. అధికారుల అలసత్వమో.. నిర్లక్ష్యమో తెలియదు కానీ… మార్కెట్‌లో లీజు ఆకాశానికి అంటుతున్నా ఎండోమెంట్‌ అధికారుల నిర్లక్ష్యంపై విమ ర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు వేసిన వేలం పాటను కాదని, గ్రామంలో మరోసారి వేలం పాట నిర్వ హించడంతో లక్షల్లో దేవుడు సొమ్మును కాజేసినట్టయింది. ఎండోమెంట్‌ అధికారులు నిర్వహించిన వేలం పాటకు ఆలయానికి రూ.12లక్షల 40 వేలు ఆదాయం రాగా, అదే వ్యక్తి గ్రామంలో మరోసారి బహిరంగ వేలం పాట నిర్వహించడంతో రూ. 40,40,000 ఆదాయం వచ్చినట్టు తెలిసింది. ప్రభుత్వానికి చెల్లించనదానికి, మరోసారి పాట నిర్వహించిన దానికి రూ.28 లక్షల వ్యత్యాసం వచ్చింది. మూడేళ్ల కాల పరిమితి గాను దేవుడు సొమ్ము సుమారు రూ. 84 లక్షల దొడ్డిదారిన కాజేశారని వాదనలు వినిపిస్తు న్నారు. ఈ తతంగంపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

వేలం పలుమార్లు వాయిదా..

గతంలో కంటే చేపల చెరువుల వేలం పాట తక్కువగా వస్తుందని, పలుమార్లు వాయిదాలు వేస్తూ వచ్చాం. చేపల చెరువుల వేలం పాటలను నిర్వహించాం. పాట దారులెవ్వరూ ముందుకు రాకపో వడంతో చివరికి ఒక ఎకరానికి రూ.31 వేలకు చింతపాడు గ్రామా నికి చెందిన వ్యక్తి పాడుకున్నారు. అయితే గ్రామంలో మరోసారి బహిరంగ వేలం పాటను నిర్వహించినట్టు నా దృష్టికి రాలేదు.

– వీఎన్‌కే శేఖర్‌, ఈవో

source: ఈనాడు