News

జమ్మూ కాశ్మీర్‌లో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్‌.. పైలట్లకు తీవ్రగాయాలు

16views

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటన జమ్ము కాశ్మీర్‌లోని కిష్త్వార్‌ జిల్లాలోని అటవీ సమీపంలో చోటుచేసుకుంది. ఈ మేరకు ఆర్మీ అధికారులు కిష్వార్‌ జిల్లాలోని మార్వా అటవీ ప్రాంతంలో భారత ఆర్మీకి చెందిన ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌ హెలికాప్టర్‌ గురువారం కూలిపోయినట్లు తెలిపారు.

ఈ హెలికాప్టర్‌లో పైలట్‌, కోపైలట్‌ తోసహా ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, వారికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు.

ఐతే వారంతా సురక్షితంగానే ఉ‍న్నారని అన్నారు. ‍ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలికి రెస్క్యూ బృందాలు చేరకున్నట్లు కిష్త్వార్‌ జిల్లా పోలీసు అధికారి ఖలీల్‌ పోస్వాల్‌ పేర్కొన్నారు. సెర్చ్‌ ఆపరేషన్‌ జరుగుతోందని, ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.