News

దుర్గగుడి లో సూపరింటెండెంట్ నగేష్ పై అవినీతి ఆరోపణలు

78views

దుర్గగుడి లో సూపరింటెండెంట్ గా పని చేస్తున్న నగేష్ పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో డీజేపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ.. నగష్‌ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు జరిపారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు విజయవాడలోని కుమ్మరిపాలెంలోని లోటస్ లెజెండ్ అపార్ట్‌మెంట్, ఫ్లాట్ నంబర్ ఎఫ్-34లోని నివాసం, తూర్పుగోదావరి & పశ్చిమగోదావరి జిల్లాల్లోని మరో 6 చోట్ల (భీమడోలు, ద్వారకా తిరుమల, నిడదవోలు) దుర్గా దేవాలయంలోని ఏఓ కార్యాలయంతో పాటు ఏఓ బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. పలు రికార్డు లు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.