ArticlesNews

కాలాన్ని దైవంగా భావించి.. ఆరాధించే సనాతన ధర్మం మనది.. ఉగాది సందర్బంగా ప్రత్యేక కథనం!

179views

విశ్వంలో కేవలం చలనం మాత్రమే లేదు. అన్ని సాపేక్ష చలనాలే.. అదేరకంగా కచ్చిత కాలం లేదు. కాలం కూడా సాపేక్షమే అంటే వేరే దానితో పోల్చి చెప్పడం. గీతలో కాలః కలయతామహమ్‌(10-30) అన్నింటినీ నియంత్రించే వాటిలో కాలిమును నేనే. అని భగవానుడు చెప్పినట్లు కాలాన్నే దైవంగా భావించి (కాలయ తస్మై నమః) కాలాన్ని ఆరాధించే విశేష సనాతన ధర్మం మనది. వస్తువుల మధ్య దూరం స్థలం అయినట్లే రెండు సంఘటనల మధ్య వ్యవధే కాలం. కనిపించే వస్తు ప్రపంచంలో కనిపించకుండా కదలి పోయేదే కాలం. మన వేద రుషులు సంఘటనల రాపాంతరాన్నికాలం అన్నారు. మూడుత్రస రేణువులు దాటడానికి సూర్యకిరణానికి పట్టే ‘తృటి’ కాలం నుంచి బ్రహ్మ ఆయుర్దాయం 100 సంవత్సరాల వరకు కలగణన చేశారు. అతి చిన్న కాల ప్రమాణం నుంచి అతిపెద్ద కాల ప్రమానం వరకు సూర్య చంద్ర నక్షత్ర రాశి మండలాల కదలికలను ఎటువంటి యంత్ర పరికారాల సహాయం లేకుండా గణిత సూత్రాల సహాయంతో ఎలా లెక్కకట్టాలో విస్మయం కలిగిస్తుంది. కనుగొన్న ఊహించిన ప్రతి విషయాన్న సంస్కృత మంత్ర రూపంలో నిర్దిష్ట మయిన వ్యాకరణ చందస్సు వృత్తాలతో నిక్షిప్తం చేసి ఎవరు నాశనం చేయలేని అక్షర సంపదను తరతరాలుగా ఎన్నో తరలాకు వారసత్వంగా వైజ్జానిక సంపదను అందించడం మన సంస్కృతి విశిష్టత.

మనం నివసించే ఈ విశ్వం నాలుగు కొలతల సమాహారం. అవి పొడవు, వెడల్పు, ఎత్తు, మరియు కాలం. ఏదైనా సంఘటనను వివరించడానికి రిఫరెన్స్‌ ఫ్రేమ్ అవసరమని దానికి (ఎక్స్‌, వై, జెడ్‌, టీ) అని పేరు పెట్టారు. మూడు అక్షాలు ఖండించే బిందువు నుంచి సంఘటన ఎక్కడ (ఎక్స్‌, వై, జెడ్‌) ఎక్కడ (టి) జరిగిందో చెప్పడం భౌతికశాస్త్రంలో ముఖ్యమైన నియమం. స్థలాన్ని కాలాన్ని విడదీయడానికి వీలులేదు. దీన్నే ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్దాంతం ద్వారా స్పేస్‌ టూం కంటిన్యూవమ్‌ అని పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని మన సనాతన శాస్త్రవేత్తులు సంకల్పం ద్వారా తెలియజేశారు. హిందూ కాలగణన ఆధారంగా ఏ వైదిక, అ వైదిక కార్యక్రమానికైనా సంకల్పం చెప్పుకోవలసిందే. సంకల్పంలో చెప్పిన కాలగణన మన పూజ ఎక్కడి నుంచి ఎప్పుడు చేస్తున్నామో అనే ప్రాథమిక అంశాలను పరిశీలిస్తే.. ఆధునిక భౌతిక శాస్త్రంలో చదివే అన్ని సిద్దాంతాలు మన వేద రుషులు ఎప్పుడో చూశారని మనకు అర్థమవుతుంది.

సంకల్పము

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్త మానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే, జంబూద్వీపే, భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య…. ప్రదేశే,

 

……………….2…………… నద్యోః మధ్యప్రదేశ్ శోభనగ్నహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానస్య వ్యావహారిక చాంద్రమానేనా ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీమత్……
సంవత్సరే….. ఆయనే……. ౠతౌ…. మాసే

…….పక్షే…. తిధౌ…. వాసరే,

……….. నక్షత్రే ……….. యోగే………… కరణే…….
ఏ వంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ …… ప్రా:తస్సన్ధ్యా ముపాసిష్యే |

ద్వితీయ పరార్ధే

బ్రహ్మ దేవుడి కాలమానం ప్రకారం బ్రహ్మ పూర్ణ ఆయుర్దాయం వంద సంవత్సరాలు దీనినే పర అంటారు. 1 సంవత్సరం – 360 రోజులు. 1 ఒకరోజు అంటే ఒక పగలు, ఒక రాత్రి.. గజ మర్త్యమానం (humanu Years) ప్రకారం 31, 10,40,000000000 సంవత్సరాలు (వేయి మహాయుగాలు) యాభై బ్రహ్మ సంవత్సరాలని పరార్థం అంటారు. ఇప్పుడు ఉన్న బ్రహ్మ యొక్క మొదటి పరార్థం గడిచిపోయింది. బ్రహ్మ పగటివేళ ‘ విశ్వాన్ని సృష్టిస్తా విశ్వంలోని మొత్తం గెలక్సీలన్ని, కోటాను కోట్ల నక్షత్రాలు, ఒకే చోట ఒకే ముద్దగా ఒక బ్రహ్మాండంగా ఉండేది. కాల ప్రారంభ ప్రథమక్షణంలో (Zero fime) బ్రద్ధలై విశ్వం ఒక క్రమ పద్ధతిలో పరిణామం చెంది ప్రస్తుతస్థితికి వచ్చింది. దీన్నే Bigbang theory లేదా మహా విస్ఫోటన సిద్ధాంతం అని అంటారు. బ్రహ్మకు 50 సంవత్సరాలు (పర+ అర్ధే) గడిచిపోయినవి. ఇప్పుడు ద్వితీయ పరార్దంలో ఉన్నాము . అంటే 100 సంవత్సరాలలోని 50 పూర్తి అయ్యి (పద్మకల్పం) 51 వసంవత్సరంలోని మొదటి రోజులో (శ్వేతవరాహ కల్పే) ఉన్నాము.

శ్వేతవరాహకల్పే…
శ్వేత (తెల్లని) వరాహ (అడవిపంది) కల్పము. కల్పము అనగా…. 4.32 బిలియన్ సంవత్సరాలు అనగా బ్రహ్మకు ఒక పగలు. ఒక కల్పంలో 14 మన్వంతరాలు ఉంటాయి. 14 మంది మనువులు. ఒకరి తరువాత ఒకరు రాజ్యం చేస్తారు.

వైవస్వత మన్వంతరే..
మన్యంతరానికి 31,1040,000 సంవత్సరాలు. ఒక్కొక్క మనువు రాజ్యం చేసే కాలాన్ని అతడి మన్యంతరం అంటారు. ప్రస్తుతం నడుస్తున్నది ఏడవ మన్వంతరం – పాలిస్తున్న రాజు వైవస్వత మనువు, ఒక్కొ మన్వంతరంలో 71 మహాయుగాలు ఒక్కొక్క యుగంలో నాలుగు యుగాలు ఉంటాయి. ”చత్వారో మనవస్తథా” (గీత-10-6)

కలియుగే ప్రథమపాదే…
కృతయుగం = 17,28,000 సంవత్సరాలు
త్రేతాయుగం = 12,96,000
ద్వాపరయుగం = 8,64,000
కలియుగం = 4,32,000
ఈ నాలుగు యుగాలు కలిపి మహాయుగం లేదా చతుర్యుగం అంటారు (43,20,000 సంవత్సరాలు)

అంటే భారతీయ కాలగణన ప్రకారం ఇప్పుడు మనం రెండవ పరార్ధంలోని మొదటి కల్పంలో ఏడవ మన్యంతరం 28వ మహాయుగంలో కలియుగంలో ప్రధమపాదంలో 5124 వసంవత్సరంలో ఉన్నాము. బ్రహ్మదేవుని పగలు పూర్తి కాగానే ప్రళయం వస్తుంది. ఈ విశ్వమంతా శ్రీమన్నారాయబడిలో లీనమైపోతుంది. విశ్వంలోని పదార్ధమంతా ఒక బిందువు వద్దకు ముకుళిత మవుతుంది. మళ్లీ బ్రహ్మకు పగలు ప్రారంభం కాగానే సృష్టి ప్రారంభం అవుతుంది. ఆది అంతం లేకుండా సృష్టి – స్థితి – లయం ఓ క్రమంలో జరుగుతాయని మన సనాతన శాస్త్ర వేత్తలు లెక్కవేసారు. ఆధునిక శాస్త్ర వేత్తలు (ఐన్ స్టీన్, జార్జి గమోవ్‌, కార్ల్ సెగాన్) విశ్వవిస్తరణ విశ్య ముకుళన ఒకదాని తరువాత ఒకటి జరుగుతాయని దీనినే విశ్వచనం స్పందన సిద్దాంతం అని నిర్దారించారు.

సర్వభూతాని కొంతీయ
ప్రకృతిం యాంతి మామి కామ్
కల్పక్షయే పునస్తాని
కల్పాదౌ విసృజామ్యహమ్ (గీత -9-7)

కల్పము చివర సమస్త ప్రాణులు నా ప్రకృతి శక్తి యందు విలీనమవుతాయి. మరల కల్ప ప్రారంభమున నేను దృషి విశ్వాన్ని సృష్టిస్తాను. సంకల్పంలో చెప్పినట్లుగా మనం ఉన్న జంబూ ద్వీపంలో, భారతవర్షం భారతదేశంలో మేరుపర్వత దక్షిణం వైపు శ్రీశైలంకు ఈశాన్య ప్రదేశంలో కృష్ణా గోదావరి నదుల మధ్య నా ఇంటిలో అందరి సమక్షంలో అంటా మనం మన ప్రదేశాన్ని కాలాన్ని ఖచ్చితంగా చెప్పే అత్యద్భుత ఊహ మీరే సంస్కృతోతిలో కనబడదు. స్థలం కాలం రెండు సాపేక్షాలు కాబట్టి సంకల్పం చెప్పే వ్యక్తికి ద్వీపం, పర్వతం, పుణ్యక్షేత్రం నదులపేర్లు మారుతూ ఉంటాయి.

సంవత్సరే…
చాంద్రమానం (చంద్రుని కదలికల ఆధారంగా) పంచాంగం ప్రకారం ప్రభవతో మొదలై క్షయ వరకు ఉన్న 60 సంవత్సరాలలో 37వ సంవత్సరం అయిన శోభకత్ సంవత్సరం, 60 సంవత్సరాలు ఒక యుగం.

సహాజసం శోభకృతం
నృ ణా మిష్ట ద మా శ్ర యే
శిబికా వాహన రూఢం
చామరద్వయ పాణినమ్ అంటూ ఈ ఉగాదికి శోభకత్ సంవత్సర స్వామికి స్వాగతం పలుకుదాం.

అయనే..
అయనం అంటే పయనించడం. అయనం అంటే ఆరుమాసాల కాలం, ప్రతి సంవత్సరం రెండు అయనాలు 1. ఉత్తరాయణం, 2. దక్షిణాయణం… సూర్యుడు భూమధ్య రేఖ నుండి ఉత్తరం వైపు ప్రయాణం చేసి తిరిగి భూమధ్యరేఖకు చేరే సమయాన్ని ఉత్తరాయణం (మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట, ఆషాడ మాసాలు) అంటారు. సూర్యుడు భూమధ్యరేఖ నుండి దక్షిణంవైపు పయనించి తిరిగి భూమధ్యరేఖకు వచ్చే సమయం దక్షిణాయనం (శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర, పుష్యమాసాలు)

 

!! ష ణ్మాసా ఉత్తరాయ ణం !!
షణ్మాసా దక్షిణాయం (గీత 8-25)

 

బుతౌ..

భూమిభ్రమణ అక్షం కక్ష్య సుమారుగా 23.4 డిగ్రీల కోణంలో వంగి ఉండడం వలన ఋతువులు ఏర్పడతాయి. భూమి ఉపరితలంపైకి చేరే సూర్యకాంతి తీవ్రతలలోని మార్పుల ద్వారా 6 బుతువులుగా విభజించారు. వసంత బుతువు (చైత్ర వైశాఖ), గ్రీష్మ ఋతువు (జ్యేష్ట – ఆషాడ) ( వర్ష ఋతువు (శ్రావణ – భాద్రపద), శరద్ బుతువు ( ఆశ్వయుజం -కార్తీకం) హేమంత ఋతువు ( మార్గశిర – పుష్య) శిశిర ఋతువు (మాఘ – ఫాల్గుణ),
ఋతూనాం కుసుమాకరః || (గీత-10-35)

మాసే…
మాసే అనగా నెల పేరు (30 రోజులు) ఖగోళ శాస్త్రం ప్రకారం భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి చంద్రుడికి పట్టే సమయం చంద్రమాసం. పన్నెండు నెలలు చాంద్రమాన సంవత్సరాన్ని పూర్తి చేస్తాయి. చంద్ర వ్యవస్థను సౌరవ్యవస్థతో సర్దుబాట్ల వలన ఒక్కోసారి 13 మాసాలు (అధికమాసం) లేదా 11 నెలలు (క్షయమాసం) వస్తాయి, మాసంలోని పూర్ణిమ రోజు చంద్ర నక్షత్రం ఆధారంగా చంద్రమాసాలకు పేరుపెట్టారు. అంటే 27 నక్షత్రాలలో 12 నక్షత్రాల ఆధారంగా మాసాలకు పేర్లుపెట్టారు.

1. చైత్రము(మార్చి/ఏప్రిల్- చిత్ర
2. వైశాఖ (విశాఖ) – ఏప్రిల్ /మే
3. జ్యేష్టం (జ్యేష్ట – మే\జూన్
4. ఆషాడం (పూర్వ ఉత్తరాషాడ – జూన్ /జులై
5. శ్రావణం (శ్రవణ) – జులై ఆగస్టు
6, భాద్రపదం (పూర్వ – ఉత్తరాభాద్ర) – ఆగస్టు / సెప్టెంబరు
7. ఆశ్వయుజం (అశ్విని) – సెప్టెంబరు, అక్టోబరు
8. కార్తీకం (కృత్తిక) – అక్టోబరు/ నవంబరు
9. మార్గశిరం (మృగశిర) – నవంబర్/ డిశంబర్
10. పుష్యం (పుష్యమి) – డిసెంబర్ / జనవరి
11. మాఘం (మఖ) జనవరి/ఫిబ్రవరి
12. ఫాల్గుణం (పుబ్బ / ఉత్తర) – ఫిబ్రవరి/మార్చి

|| మాసానాం మార్గశీర్షాహం ॥ (గీత-10-35)

పక్షే..
పక్షము అనగా 15రోజులు. ఇవి రెండు రకాలు కృష్ణ పక్షము, శుక్ల పక్షము. చంద్రుడు భూమి చుట్టూ తూర్పుగా తన ప్రయాణం సాగిస్తాడు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఈ ముగ్గురి స్థానాలను బట్టి ఏర్పడే కోణం మారుతూ ఉంటుంది. కోణం పెరుగుతూ ఉన్న కొద్ది చంద్రునిపై సూర్యకాంతి పడేభాగం ఎక్కువై మనకు కనిపించడం మొదలవుతుంది. ఇదే శుక్ల (తెల్లని కాంతివంతమయిన) పక్షం( 15రోజులు) అమావాస్య (New Moon) తరువాత మొదలై పాడ్యమి నుండి పూర్ణిమ వరకు చంద్రకాంతి పెరుగుతుంది.
పూర్ణిమ తరువాత చంద్రునిపై సూర్యకాంతి పడే భాగం తగ్గిపోతుంది. ఇదే కృష్ణ (నల్లని) పక్షం. పూర్ణిమ తరువాత (Full Moon) మొదలై అమావాస్యతో ముగుస్తుంది.

తిథి..
చంద్రుని ఆధారం చేసుకొని ఉన్న నెలలో ఒక రోజును తిథి అంటారు. ప్రతి మాసంలో (Moon – Month) 30 తిథులు వస్తాయి. గణిత సూత్రాల ప్రకారం చసూర్యుడును, చంద్రుడిని కలుపుతూ ఉన్న అంక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథిగా లెక్కకట్టారు. సూర్యుడు, చంద్రుడు కలసి ఉంటే ( సున్నా డిగ్రీలు) అమావాస్య…… సూర్యుడు, చంద్రుడు ఒకరికొకరు సమాన దూరంలో ఉంటే (180° డిగ్రీలు) పౌర్ణమి. తిథులు రోజులో ఏ వేళ అయినా మొదలయ్యి, అంతమవవచ్చు. ఒక్కొక్క తిథి సుమారుగా 19 నుండి 26 గంటల సమయం ఉంటుంది.

1. పాడ్యమి 2. విదియ 3. తదియ 4. చవితి 5. పంచమి 6. షష్టి 7. సప్తమి 8. అష్టమి 9. నవమి 10. దశమి 11. ఏకాదశి 12. ద్వాదశి 13. త్రయోదశి 14. చతుర్దశి 15. పూర్ణిమ లేదా పౌర్ణమి అమావాస్య , మొదటి తిథి పాడ్యమి రోజున సూర్యచంద్రుల మధ్య 12 డిగ్రీలు అక్షాంశ కోణం ఉంటే విదియ రోజు 24 డిగ్రీలు ఇలా చంద్రుడు 180 డిగ్రీలు సూర్యుని నుండి జరిగినపుడు పూర్ణిమ – తిరిగి సూర్యుని చేరితే అమావాస్య వస్తాయి. (శుక్ల కృష్ణ పక్షాలు)

వారం…
వారం అనగా ఏడు రోజుల సమాహారం. ఒకరోజు సూర్యోదయంతో ప్రారంభమై మరుసటి రోజు తెల్లవారి సూర్యోదయంతో పూర్తి అయ్యేది. గ్రహాల పేర్ల ఆధారంగా ఏడు వారాలు. మనకు రోజు సూర్యోదయంతో ప్రారంభమయితే పాశ్చాత్యులకు అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమవుతుంది. సోమవారం(చంద్రుడు), మంగళవారం (అంగారకుడు) బుధవారం(బుధుడు) గురువారం (జూపిటర్.) శుక్రవారం (వీనస్‌) ) శనివారం (శాట్రన్‌) ఆదివారం(సూర్యుడు)
ఉదయాదుదయం భానోర్భూమిసావనవాసరా (సూర్య సిద్ధాంతం)

నక్షత్ర..
ఆ రోజు చంద్రుడు ఏక రాశి చక్రం నుండి ప్రమాణం చేస్తున్నాడో రాశిలో ప్రముఖమైన నక్షత్రాన్ని తెలుపుతుంది. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఘ, పూర్వఫల్గుణి, ఉత్తర ఫల్గుణి, హస్త, చిత్ర, స్వాతి, విశాఖ, అనూరాధ జ్యేష్ట, మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ శ్రవణం, ధనిష్ట శతబిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.

! ! నక్షత్రామహం శశ్రీ 11 (గీత-10-21)

యోగ…
సూర్యుడు మరియు చంద్రుని స్థానాలను బట్టి యోగను లెక్కించాలి. ఏ రోజుకు యోగం విలవ కనుగొనాలో ఆరోజు సూర్యుని రేఖాంశం మరియు చంద్రుని రేఖాంశం రెండింటిని కూడవలెను. వచ్చిన మొత్తాన్ని 13 డిగ్రీల 20 నిమిషాలు (13×60′ + 20′ = 800 నిమిషాలు] తో భాగించగా వచ్చిన విలువను ఆ రోజు యొక్క యోగముగా నిర్ణయిస్తారు. ఉదాహరణకు విలువ 15 డిగ్రీల 56 నిమిషాలు వచ్చినచో 15 యోగములు గడచి 16వ యోగము జరుగుతున్నట్లుగా భావించాలి. 16వ యోగము పేరు సిద్ది. ఆరోజు యోగము సిద్ధి యోగ. ఈ విధంగా పంచాంగములో 27 యోగములు ఉన్నాయి.

1. విష మంభ, 2. ప్రీతి, 3. ఆయుష్మాన్, 4 . సౌభాగ్యా, 5 .శోభన, 6. అతిగండ, 7. సుకర్మ, 8. ధృతి, 9. శూల, 10. గండ, 11. వృద్ధి, 12. ధృవ, 13. వ్యాఘత, 14. హర్షన, 15.ప్రజ్, 16. సిద్ధి, 17. వ్యతిపత, 18. వరియణ, 19. పరిఘ, 20. శివ, 21. షిదా, 22. సథ్య, 23 బ్రహ్మ, 24. ఇంద్ర లేదా ఇంద్ర 27. వైథితి

కరణం….

సూర్యుడి నుండి చంద్రుడు 6 డిగ్రీల కోణం. తిరగడం వలన వచ్చే స్థితిని కరణం అంటారు. చంద్రుడు సూర్యుడి నుండి 12 డిగ్రీలు తిరిగితే తిథి అంటారు. అంటే తిథిలో సగభాగాన్ని ‘కరణ’ అంటారు. చంద్రుని రోజు లేదా తిథి ఆధారంగా కాలము ఉంటుంది. ఒక తిథిలో రెండు కరణాలు ఉంటాయి, తిథి ప్రథమార్థంలో ఒక కరణం, ద్వితీయార్థంలో మరొక కరణం వస్తాయి. 70 చల కరణాలు రెండు పక్షాలలో (కృష్ణ, శుక్ల) ఎనిమిది సార్లు వస్తాయి అంటే 56 కరణాలు. మిగిలిన నాలుగు స్థిరకరణాలు ఒక నిర్ధిష్ట నియమాలను కోణాలను అనుసరించి వస్తాయి. ఈ విధంగా ఒక చంద్ర మాసం (ఒక నెల) 60 కరణాలను కలిగి ఉంటుంది, ప్రతికరణాన్నికి ఒక చిహ్నంతో సూచిస్తారు.

1. బావ (సింహం), 2. బలవ (చిరుతపులి), 3. కౌలవ (కుటుంబం), 4. తైతిల (గాడిద), 5. గార(ఏనుగు), 6. వణిజ (ఆవు), 7. విష్టిభద్ర (కోడి), చలకరణాలుగా నిర్ణయించారు.

1. శకుని (పక్షి) 2.చతుర్ష్పాదం (నాలుగు కాళ్ళ జంతువు), 3. నాగ (పాము) 4. కిస్తుఘన్ (కీటకం – చిమ్మటలు), స్థిరకరణాలుగా నిర్ణయించారు.