News

చర్చి నిర్మిస్తున్నామని డబ్బులు వసూలు.. పెడనలో వెలుగుచూసిన ఘటన!

90views

కృష్ణా జిల్లా పెడన పట్టణ రాజీవ్ నగర్ కాలనీ 10వ వార్డు చెందిన కొందరు వ్యక్తులు చర్చి కడుతున్నామని పలు గ్రామాల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. బిల్లు పుస్తకాలు ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామంలో చర్చి పేరుతో అబద్దాలు చెబుతూ.. డబ్బులు వసూలు చేసుకుని జీవనం సాగించేందుకు ఇలా బయలుదేరి వస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.