News

శ్రీకాళహస్తీశ్వరుడికి వెండి అంబారీల కానుక

40views

తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరుడికి ఓ భక్తుడు భారీ కానుకలు అందజేశారు. బెంగళూరుకు చెందిన మల్లాడి బాలసుబ్రహ్మణ్యం, మల్లాడి నాగేశ్వరరావు దంపతులు ఆలయానికి వెండి అంబారీలను కానుకగా అందజేశారు. రూ.1.36 కోట్ల వ్యయంతో అంబారీలు చేయించారు.. ఉత్సవమూర్తులైన జ్ఞానాంబిక, సోమస్కందమూర్తి పురవీధుల్లో విహరించేందుకు వీలుగా వెండితో వీటిని తయారు చేయించారు.