News

శ్రీశైల నందీశ్వరునికి విశేష అభిషేకాలు

53views

శ్రీశైల క్షేత్రంలో త్రయోదశిని పురస్కరించుకొని సాయంప్రదోషకాలంలో ఆలయంలోని మల్లికార్జునస్వామికి అభిముఖంగా కొలువైవున్న నందీశ్వరస్వామికి పరోక్షసేవగా విశేష అభిషేక అర్చనలు చేశారు. పూజాకార్యక్రమంలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహా గణపతి పూజను నిర్వహించారు. శ్రీశైల క్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో పూజలలో పాల్గొనేందుకు దేవస్థానం ఈ పరోక్షసేవల ద్వారా అవకాశం కల్పించింది. భక్తులు ఈ పరోక్షసేవలో పాల్గొనేందుకు దేవస్థానం వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. శ్రీశైలదేవస్థానం. ఓఆర్‌జీ ద్వారా ఒక్కో పూజకు రూ.1,116 లు సేవారుసుమును చెల్లించి పాల్గొనవచ్చు. సేవాకర్తలే కాకుండా, భక్తులందరూ కూడా నందీశ్వరస్వామికి ఆర్జిత పరోక్షసేవ పూజా కార్యక్రమాన్ని శ్రీశైలటీవీ లేదా యూట్యూబ్‌ ద్వారా వీక్షించవచ్చును. సాయంత్రం స్వామిఅమ్మవార్లకు ఊయల సేవను వైభవంగా నిర్వహించారు. అలాగే శ్రీశైల క్షేత్ర గ్రామదేవత అంకాలమ్మకు లోకకల్యాణాన్ని ఆకాంక్షిస్తూ విశేష పూజలను దేవస్థానం నిర్వహించింది.