News

వీరోచిత విన్యాసాలను పొందుపరుస్తూ పుస్తకాన్ని విడుదల చేసిన త్రివిధ బలగాల అధిపతులు!

105views

భారతదేశ వైమానిక దళాధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి… మిగ్ 29 యుద్ధ విమానాన్ని 1.9 మ్యాక్‌ల వేగం అంటే శబ్ధవేగానికి రెండింతల స్థాయి వేగంతో నడిపారు. ఈ వేగంతో విమానం దూసుకుపోతున్న దశలో పైకప్పు ఎగిరిపోయిన దశలోనే అత్యంత చాకచక్యంగా దీనిని గమ్యస్థానానికి చేర్చారు. అదే విధంగా పదాతిదళం, నౌకాదళం ప్రధానాధికారులు కూడా తమ వీరోచిత విన్యాసాల క్రమాన్ని సగర్వంగా ఏకరువు పెట్టుకుంటూ ఓ పుస్తకరూపంలో తీసుకువచ్చారు. ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ – 3 పేరిట వెలువడిన ఈ పుస్తకంలో ఈ ముగ్గురు తమ అత్యంత అరుదైన పది సాహస ఘట్టాలను పొందుపర్చారు.

మిగ్ 29తో ఓ ఆటాడుకున్న ఎయిర్ చీఫ్ మార్షల్ చౌదరి తాను మిగ్‌ను భూమికి 12.3 కిలోమీటర్ల ఎత్తున అత్యంత వేగంగా, శబ్ధవేగాన్ని మించిపోయి నడిపిన అనుభవాన్ని చాటారు. ఈ దశలో వెలుపలి ఉష్ణోగ్రతలు మైనస్ 53 డిగ్రీలు ఉన్నాయని తెలిపారు. గడ్డకట్టుకుపోయే చలి వాతావరణంలో ఈ స్పీడ్‌లో మిగ్‌ను నడపడం, శబ్ధవేగాన్ని మించిపోయిన దశలో రగిలే వేడితోనే సాధ్యమని చమత్కరించారు.

తమ సాహసాలతో వెలువడ్డ పుస్తకావిష్కరణ దశలో త్రివిధ బలగాల అధిపతులు మాట్లాడారు. విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ పుస్తకావిష్కరణ సభకు పలువురు సీనియర్ సైనికాధికారులు, సైనిక సిబ్బంది కుటుంబ సభ్యులు, విభిన్న రంగాలకు చెందిన వారు హాజరయ్యారు.