ArticlesNews

అయ్యప్ప స్వామి నేపథ్యం ఉన్న చిత్రం బాగుందన్నందుకు సీపీపీ నాయకుడి దుకాణం ధ్వంసం.. కేరళలో చోటుచేసుకున్న దారుణ ఘటన!

279views

శబరిమలకు వెళ్లాలనుకునే ఓ ఎనిమిదేళ్ల బాలిక చుట్టూ సాగే కథాంశంతో రూపొందిన ‘మలప్పురం’ చిత్రాన్ని మెచ్చుకున్న సీపీఐ కార్యకర్త దుకాణాన్ని కొందరు ధ్వంసం చేశారు. సినిమా చూసి వచ్చిన అతను మూవీ బాగుందని సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో గుర్తు తెలియని దుండగులు అతని దూకాణాన్ని ధ్వంసం చేశారు. ఈ సంఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాలు ఇలా..
సీపీఐ స్థానిక నాయకుడిగా ఉన్న సి.ప్రగిలేష్‌కు లైట్ అండ్ సౌండ్ సర్వీస్ దుకాణం మలప్పురంలో ఉంది. ఈ దుకాణాన్ని జనవరి 1వ తేదీ రాత్రి గుర్తు తెలియని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ దాడిలో దుకాణానికి సమీపంలో ఉంచిన అనేక కొత్త బోర్డులు, అలంకరణ దీపాలు దెబ్బతిన్నాయి. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సామాజిక మాధ్యమాలలో సినిమాపై అతని పోస్టింగులు చేయగా.. కొందరు సోషల్ మీడియా ద్వారా బెదిరించారని ప్రగిలేష్ తెలిపాడు. “ఇటీవల తాను సినిమాని మెచ్చుకుంటూ కొన్ని పోస్ట్‌లు పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో కొన్ని చర్చలు జరిగాయని.. ఆ తర్వాత కొందరు సోషల్ మీడియా యూజర్లు తనపై , తన షాపుపై దాడి చేస్తామని బెదిరించారు’ అని ప్రగిలేష్ చెప్పుకొచ్చాడు. బాధితుని ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు సెక్షన్లు 427, 435 ఆస్తి ధ్వంసం కింద కేసులు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని పెరుంబడప్పు పోలీసులు తెలిపారు.