
397views
భిక్ష అంటే పూజ్యులైన సాధువులకు ఇచ్చే సొమ్ము. ఉన్నంతలో కొంత దానం చేయడం అనేది అందరి కర్తవ్యంగా ఉండాలి. ”భిక్ష్యాం దేహీ” అంటూ వాకిట్లోకి వచ్చేది స్వయంగా విష్ణుమూర్తేనని, మనల్ని ఉద్దరించడానికి వచ్చారని భావించాలి. అతిథికి అర్పించి భిక్ష ఇవ్వాలి. ఇందులో నా చేయి పైన ఉంది.. నీది కింద అనే రాక్షశ భావానికి ఇసుమంతైన మనసులో ఉండకూడదు. ఇచ్చేదీ, ఇప్పిస్తున్నదీ భగవంతుడే అనుకోవాలి. భగవద్గీత శ్లోకాలను అనుసరించి.. ఇంట్లోకి పిలిచి ఇవ్వడంలో గౌరవభావం ఉంటుంది. దాత, పతిగ్రహీత సమస్థాయిలో ఉండటం ఇద్దరూ సమానమేనని చెప్పడం. ఇల్లు వాకిటి కంటే ఎత్తులో ఉంటుంది కాబట్టి గడప దాటి వెళ్లి తన స్థాయి తగ్గించుకుని ఇవ్వడం భిక్షార్థిపైన గౌరవం చూపడమౌతుంది. వచ్చిన వ్యక్తికి మొక్కుబడిగా కాక.. గౌరవంగా ఇవ్వడం ఉత్తమదానం అనిపించుకుంటుంది. అందుకే భిక్ష గడప దాటి ఇవ్వాలని పెద్దలు చెబుతుంటారు.





