
ఇరాన్: ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా గత కొన్నాళ్లుగా సాగుతున్న ఆందోళనలను కర్కశంగా అణచివేసేందుకు ప్రభుత్వం వెనకాడటం లేదు. అయినా అణచివేతను ధిక్కరిస్తూ ఆందోళనలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నిరసన ఎవరకు ప్రదర్శించినా ఊరుకునేది లేదనేది చెప్పడానికి ఇరాన్ సుప్రీం లీడర్ మేన కోడలును కూడా అరెస్ట్ చేశారు. అలాగే, భారత్‌కు వెళ్ళేందుకు ఓ సినీ నిర్మాతకు ఇరాన్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళన సాగుతున్న వారినందరినీ జైళ్ళకు పంపుతున్న ఇరాన్ ప్రభుత్వం తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ మేనకోడలు ఫరీదే మొరద్‌ఖానీని కూడా అరెస్ట్ చేశారు. ఇరాన్ ప్రభుత్వం అరాచకాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ సుప్రసిద్ధ మానవ హక్కుల కార్యకర్త ఫరీదో మొరద్‌ఖానీ ఇరాన్‌తో సంబంధాలను తుంచుకోవాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు.
ఈమె వీడియో వైరల్ కాగానే ఆయనను కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇరాన్ ప్రభుత్వాన్ని ఆమె ‘హంతకులు’, ‘పిల్లల్ని చంపేవారు’గా అభివర్ణించారు. కాగా, ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉన్న అయతుల్లా ఖొమైనీని జర్మన్ నియంతలు హిట్లర్, ముస్సోలినీతో పోల్చేవారు.
ఇలా ఉండగా, ఇరాన్ సినిమా నిర్మాత రెజా డోర్మ్‌షియాన్‌ను భారత్ వెళ్లేందుకు ఇరాన్ ప్రభుత్వం అనుమతించలేదు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొనేందుకు రెజా గోవాకు రావాల్సి ఉన్నది. ఆయన నిర్మించిన ‘ఎ మైనర్’ సినిమా అక్కడ ప్రదర్శనకు ఎంపికైంది. అయితే హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నవారికి రెజా మద్దతు తెలుపడంతో ఆయనపై ప్రభుత్వం కక్షగట్టింది.
Source: Nijamtoday