News

సొంత జట్టు ఓటమికి సంబరాలు చేసుకొన్న ఇరానీయులు..!

57views

వాషింగ్టన్‌: ఫిఫా ప్రపంచకప్‌లో సొంత జట్టు ఓటమికి ఇరాన్‌ జాతీయులు సంబరాలు చేసుకొన్నారు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 0-1 తేడాతో ఓడిపోయింది. దీంతో ఇరాన్‌ జాతీయులు వీధుల్లోకి వచ్చి వేడుకలు చేసుకొన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. ఇప్పటికే ఇరాన్‌లో హిజాబ్‌, అణచివేతకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సమయంలో ఇవి చోటు చేసుకోవడం గమనార్హం. తమ నిరసనల్లో భాగంగానే ఇరాన్‌ ఫుట్‌బాల్‌ జట్టు ఓటమికి ఆందోళనకారులు ఉత్సవాలు చేసుకొన్నారు. చాలా మంది వీధుల్లోకి వచ్చి నృత్యాలు చేశారు. ముఖ్యంగా మాషా అమిని సొంత ఊరు సకీజ్‌ సహా పలు నగరాల్లో ఈ సెలబ్రేషన్స్‌ జరిగాయి. మ్యాచ్‌లో అమెరికన్లు తొలి గోల్‌ చేయగానే సకీజ్‌లో టపాసులు పేల్చినట్టు ‘ఇరాన్‌ వైర్‌’ వెబ్‌సైట్‌ పేర్కొంది. ”అమెరికన్లు గోల్‌ చేస్తే నేను మూడు మీటర్ల ఎత్తు ఎగిరి గెంతుతానని ఎప్పుడూ అనుకోలేదు” అని జర్నలిస్టు సయీద్‌ జఫ్రానీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి