News

చంపాను కానీ పాపం చేయలేదు.. జన్నత్ ప్రాప్తిస్తుంది: అఫ్తాబ్

150views

న్యూఢిల్లీ: కాల్‌ సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో అఫ్తాబ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. శ్రద్ధా వాకర్‌ను తాను హత్య చేసినట్టు నిందితుడు ఆఫ్తాబ్‌ పూనావాలా పాలిగ్రాఫ్‌ పరీక్షల్లో అంగీకరించినట్టు తెలుస్తోంది. తాను చేసిన పని పాపమేమీ కాదని, తనకు ఉరిశిక్ష విధించినా పశ్చాత్తాపపడేది లేదని, తన కోసం జన్నత్ (ఇస్లాంలో ‘స్వర్గం’ వంటిది)లో చోటు ఉంటుందని అన్నట్టు పోలీస్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ దైనిక్ భాస్కరన్ పత్రిక ప్రచురించింది.

శ్రద్ధాను శరీర భాగాలను అడవిలో పడేసిన విషయాన్ని కూడా ఆఫ్తాబ్‌ పాలిగ్రాఫ్‌ పరీక్ష సమయంలో చెప్పినట్టు తెలిసింది. తనకు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలున్నాయని నిందితుడు అంగీకరించినట్టు సదరు వర్గాలు పేర్కొన్నాయి. పాలిగ్రాఫ్‌ పరీక్ష సమయంలో ఆఫ్తాబ్‌ ప్రవర్తన చాలా సాధారణంగా ఉందట. శ్రద్ధ హత్యకు సంబంధించిన అన్ని వివరాలను తాను ఇప్పటికే పోలీసులకు చెప్పానని నిందితుడు పదేపదే చెప్పినట్టు సమాచారం.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి