News

పొమ్రా అటవీప్రాంతంలో ఎన్‌ కౌంటర్‌… నలుగురు మావోల మృతి

72views

బీజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలోని మీర్టూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పొమ్రా అటవీప్రాంతంలో ఎన్ కౌంటర్‌ జరిగింది. ఈ సంఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రక్షణ బలగాలు అటవీ ప్రాంతంలో సర్చ్ ఆపరేషన్ నిర్వహించగా బలగాలకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు చనిపోగా ఇంకా కొంత మంది పారిపోయినట్టు సమాచారం. పారిపోయిన మావోయిస్టుల కొసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి