236
విశాఖపట్నం: క్రైస్తవ మత ప్రచారానికి పోలీసులు సహకరించడం విశాఖపట్నంలో వివాదానికి తావిస్తోంది. నగరంలోని రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు అవుట్ పోస్టులో సంప్రదిస్తే ఆటోను ఏర్పాటు చేస్తారు. అక్కడే ధర నిర్ణయించి ప్రయాణికులకు స్లిప్ అందిస్తారు. అయితే, ఈ విధంగా ఇచ్చే స్లిప్పులపై మత ప్రచారానికి సంబంధించిన ప్రార్థనలు, ఫొటో ముద్రించారు. పైభాగంలో ట్రాఫిక్ పోలీస్, విశాఖపట్నం సిటీ అని ఉంది. దీనిపై ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఒక మత ప్రచారానికి సహకరిస్తూ.. స్లిప్పులపై ముద్రించే అవకాశాన్ని ఎలా కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం పెద్ద దుమారాన్ని రేపుతోంది.
Source: Andhra jyothi