న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ నేతల్లో నెంబర్ వన్ స్థానంలో మరోసారి నిలిచారు. ఆయనకు 77 శాతం అప్రూవల్ రేటింగ్ లభించింది. ఆయన తర్వాత ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిలిచారు. అప్రూవల్ రేటింగ్‌లో మోదీకి మిగిలిన ఇద్దరూ చాలా దూరంలో ఉన్నారు.
మోర్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సర్వే నివేదిక ఈ వివరాలను వెల్లడించిందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ట్విటర్ వేదికగా తెలిపింది. ఈ సంవత్సరం జనవరిలోనూ, గత ఏడాది నవంబరులోనూ విడుదలైన నివేదికలలో కూడా మోదీ అత్యంత ప్రజాదరణగల ప్రపంచ నేతల్లో అగ్రస్థానంలోనే ఉన్నారు. ఈ సంవత్సరం ఆగస్టులో 75 శాతం అప్రూవల్ రేటింగ్‌తో మోదీ ప్రథమ స్థానంలో నిలిచారు.
ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బ్రెజిల్, జర్మనీ, భారత దేశం, మెక్సికో, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్పెయిన్, స్వీడన్, అమెరికాలలోని ప్రభుత్వ నేతల అప్రూవల్ రేటింగ్స్‌ను మోర్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ ట్రాక్ చేస్తుంది. అంతర్జాతీయంగా రోజుకు సుమారు 20,000 ఇంటర్వ్యూలు చేస్తుంది.
Source: Nijamtoday