News

తీహార్ జైలులో ఆప్ మంత్రికి పసందైన విందు..(వీడియో)

260views

తీహార్: అవీనితి కేసులో అరెస్టయిన ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ తిహార్ జైలులో మసాజ్ చేయించుకున్న వీడియో వైరల్ కాగా, ఇప్పుడు ఆయనకు సంబంధించిన మరో వీడియోను బీజేపీ బయటపెట్టింది. జైలులో ఆయన పసందైన భోజనం చేస్తున్న దృశ్యాలను విడుదల చేసింది. కమలం పార్టీ జాతీయ ప్రతినిధి షెహ్జాద్ పూనావాలా ఈ వీడియోను ట్వీట్ చేసి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. ‘అత్యాచార కేసు నిందితుడితో జైలులో మసాజ్ చేయించుకున్న ఆప్ మంత్రి మరో వీడియోను చూడండి. ఈ సారి విలాసవంతమైన ఫుడ్‌ను ఆస్వాదిస్తున్నాడు.

వెకేషన్‌కు వెళ్లి రిసార్టు భోజనం చేస్తున్నట్టు ఉంది. కేజ్రీవాల్ ఆయన మంత్రికి జైలులో వీవీఐపీ ట్రీట్ ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు చేశారు.’ అని షెహ్‌జాద్ విమర్శలు గుప్పించారు. ఈ వీడియోలో సత్యేంజర్ జైన్‌కు ఓ వ్యక్తి కావాల్సినవన్నీ సమకూర్చుతున్నాడు. డస్ట్‌బిన్‌ను మంత్రి కుర్చీ దగ్గర పెట్టాడు. జైలు గదిలో ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లు కూడా ఉన్నాయి. దీంతో అవినీతి కేసులో అరెస్టయిన వ్యక్తికి రాజభోగాలు కల్పిస్తున్నారని బీజేపీ మండిపడుతోంది. కాగా.. ఇటీవలే సత్యేంజర్ జైన్ జైలులో మసాజ్ చేయించుకున్న వీడియోను విడుదల చేసింది బీజేపీ. అయితే అది మసాజ్ కాదని, ఫిజియోథెరపీ అని ఆప్ చెప్పుకొచ్చింది. కానీ మసాజ్ చేసిన వ్యక్తి రేప్ కేసులో నిందితుడు  అని తిహార్ జైలు అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి