చెన్నై: తమిళనాడు బీజేపీ మహిళా నేతలను ఉద్దేశించి డీఎంకే నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు ఇరుపార్టీల మధ్య దుమారాన్ని రేపాయి. డీఎంకే, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీలోని మహిళ నేతలుగా నటీమణులను డీఎంకే నేత సైదై సాదిక్ అసభ్య పదజాలంతో దూషించారు.
ఈ వ్యాఖ్యలపై స్థానిక బీజేపీ నేతలు మండిపడ్డారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నేత, సీని నటి ఖుష్బూ ఓ ట్వీట్ పెట్టారు. తమిళనాడు బీజేపీకి చెందిన ఖుష్బూ, నమిత, గౌతమి, గాయత్రీ రఘురామన్‌లు ఐటమ్స్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఖుష్బూ పెద్ద ఐటమ్ అంటూ సాదిక్ అసభ్యమైన వ్యాఖ్యలు చేశాడు.
అలాగే అమిత్‌షాను ఉద్దేశించి సాదిక్ చేసిన వ్యాఖ్యలు కూడా కమలం నాథులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఇక తన మీద చేసిన ఘాటు వ్యాఖ్యలపై సినీనటి, బీజేపీ నేత కుష్బూ సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిఎంకె నేత సైదైరు సాదిక్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఖుష్బూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను పురుషులు దుర్భాషలాడారంటే.. వారు ఎలాంటి వాతావరణంలో పుట్టి పెరిగారో అర్థమవుతుందని, ఇలాంటివారే మహిళల గర్భాన్ని అవమానిస్తారని మండిపడ్డారు. ఇదేనా ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో విరాజిల్లుతున్న ద్రవిడ సంస్కృతి అని ట్విటర్ వేదికగా ఖుష్బూ విమర్శలు గుప్పించారు.
‘పురుషులు స్త్రీలను దుర్భాషలాడడం వారి పెంపకాన్ని, పెరిగిన విషపూరిత వాతావరణాన్ని అందరికీ తెలియజేస్తోంది. స్త్రీలను అవమానించే అలాంటి పురుషులు కళైజ్ఞర్ అనుచరులుగా చెప్పుకుంటారు. గౌరవనీయులైన సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో కొత్త ద్రావిడ పాలనా నమూనా ఇదేనా?’’ అని కుష్బూ ట్వీట్ చేశారు. డీఎంకే విమర్శల పాలవుతుండడంతో కనిమొళి స్పందించాల్సి వచ్చింది.
ఈ వ్యాఖ్యలపై డిఎంకె సీనియర్ నేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సోదరి కనిమొళి బహిరంగ క్షమాపణలు తెలిపారు. మహిళలను కించపరుస్తూ తమ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఓ మనిషిగా, మహిళగా తాను బహిరంగ క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. స్టాలిన్ ఇలాంటి చర్యలను ఉపేక్షించబోరని చెప్పారు.
సైదైరు సాదిక్ కూడా క్షమాపణలు తెలిపారు. కుష్బూతో సహా ఏ నేతనూ బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని, గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నానని సాదిక్ పేర్కొన్నారు.
ఓ సమావేశంలో మాట్లాడిన డీఎంకే నేత సైదై ‘‘ డీఎంకేను నాశనం చేసిన వీళ్లు (వేశ్యలు) బీజేపీని బలోపేతం చేయడానికి ఉపయోగపడతారా?. వారి వల్ల కాదు’’ అని చెప్పుకొచ్చారు. అంతటితో కూడా ఆగకుండా మరిన్ని పరుష పదాలు ఉపయోగించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Source: Nijamtoday