
401views
ఆజాద్ నగర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్లో ఏడేళ్ళ బాలికను ఎత్తుకుపోయి దారుణ హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. స్థానికులు నిందితుడ్ని పోలీసులకు అప్పగించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆజాద్ నగర్ పోలీస్స్టేషన్ ప్రాంతానికి చెందిన బాలికను అదే ప్రాంతంలో ఉంటున్న సద్దాం అనే యువకుడు ఎత్తుకుపోయాడు. అనంతరం తన ఇంటికి తీసుకెళ్ళి తలుపు గడియపెట్టాడు. ఇది చూసిన ఓ బాలుడు.. స్థానికులకు తెలిపారు. వెంటనే స్థానిక ప్రజలంతా సద్దాం ఇంటి వద్దకు చేరుకుని బాలికను విడిచిపెట్టమని ప్రాధేయపడినా అతడి వినిపించుకోలేదు.
తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్ళి చూడగా బాలిక విగతజీవిగా పడి ఉంది. చిన్నారిని పలుమార్లు కత్తితో పొడిచి చంపాడు సద్దాం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.
Source: EtvBharat





