News

మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి అన్నదాన సత్రంలో చోరీ

133views

మంగళగిరి: ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి అన్నదాన సత్రంలో చోరీ జరిగింది. దొంగలు హుండీ పగలగొట్టి, సొమ్ము దోచుకున్నారు. ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐతే, ఈ సమాచారాన్ని ఆలయ అధికారులు, మంగళగిరి పట్టణ పోలీసులు గోప్యంగా ఉంచారు. 32 వేల రూపాయల నగదు రికవరీ చేసి, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు మంగళగిరి పట్టణ పోలీసులు తెలిపారు. కాగా, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భద్రతా లోపాలు ఉన్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి