News

డ్రగ్స్​ కీలక సూత్రధారి గోవాలో అరెస్ట్

144views

భాగ్యనగరం: దేశంలోని ప్రధాన నగరాలకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న కీలక సూత్రదారులను ఓయూ పోలీసులు, నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్​మెంట్‌ విభాగం పోలీసులు గోవాలో అరెస్టు చేసి, హైదరాబాద్​ తీసుకొచ్చారు. హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న ముఠాల గుట్టు రట్టు చేసేందుకు కొద్ది రోజుల కిందట నగర నార్కోటిక్​ పోలీసులు.. గోవాకు వెళ్లారు. అక్కడి పోలీసులతో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. అంజున బీచ్‌ అడ్డాగా చేసుకుని తెలుగు రాష్ట్రాలకు మత్తు పదార్ధాలు అంటగడుతున్న వారిపై నిఘా ఉంచారు.

అంజున బీచ్‌ సమీపంలోని హిల్‌టాప్‌ రెస్టారెంట్‌ యజమాని, మాదక ద్రవ్యాల సరఫరా సూత్రధారి జాన్‌ స్టీఫెన్‌ డిసౌజా, నూన్స్‌ను అరెస్టు చేశారు. వారిద్దరిలో ఒకరు కొవిడ్‌ సోకి, మరొకరు గుండె సంబంధ వ్యాధితో బాధపడుతుండడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి ట్రాన్సిట్‌ వారెంట్​పై నగరానికి తీసుకువచ్చి, అక్కడి నుంచి హైదరాబాద్​ తీసుకొచ్చారు. గోవా కేంద్రంగా మాదకద్రవ్యాల సరఫరాలో ఆరుగురు కీలక సూత్రదారుల కోసం టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఇంకా గాలిస్తున్నాయి.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి