News

బీజేపీ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం

173views

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణలో నేడు భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం జరుగుతోంది. ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్స్‌లో అమిత్‌ షా మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌కు అనేకానేక ప్రణామాలు… భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. నిజాం రాజ్యంలో అరాచకాలు కొనసాగాయి.

హైదరాబాద్‌ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది బలిదానాలు చేశారు. సర్దార్‌ పటేల్‌ లేకపోతే తెలంగాణ విమోచనం మరింత ఆలస్యమయ్యేది. సర్దార్‌ పోలీస్‌ యాక్షన్‌ ద్వారానే తెలంగాణ విమోచనం అ‍యింది. 108 గంటలపాటు పోలీసు చర్యలో ఎంతో మంది అమరులయ్యారు. నిజాం రాజ్యంలో అరాచకాలను ఇప్పటికీ మరువలేము. ఇంకా కొంతమంది మనుషుల్లో రజాకార్ల భయం ఉంది. భయాన్ని వదిలేసి ధైర్యంగా బయటకు రావాల‌ని పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి