
91views
భారత సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి (CJI)గా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ (యు.యు.లలిత్) నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేయనుండటంతో తన స్థానంలో జస్టిస్ యు.యు.లలిత్ పేరును ఆయన సిఫారసు చేసిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం యు.యు.లలిత్ ను భారత 49వ సీజేఐగా నియామకానికి సంబంధించిన దస్త్రంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ సంతకం చేశారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ పదవీ విరమణ చేసిన మరుసటి రోజే ఆగస్టు 27న యు.యు.లలిత్ నూతన సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నట్టు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఆయన కేవలం మూడు నెలలకన్నా తక్కువ సమయమే సీజేఐగా కొనసాగనున్నారు. నవంబర్ 8తో జస్టిస్ యు.యు.లలిత్ కు 65 ఏళ్లు పూర్తి కానుండటమే అందుకు కారణం.