News

నేతాజీ ముని మనుమరాలు అరెస్ట్

214views

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సమీపంలో పూజలు చేసేందుకు వెళుతున్న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ముని మనవరాలు రాజ్యశ్రీ చౌధరీని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారణాసికి రైలులో బయల్దేరిన ఆమెను పోలీసులు ప్రయాగ్‌రాజ్‌ రైల్వే స్టేషన్‌లో దించి..నిర్బంధంలోకి తీసుకున్నారు. హిందూ మహాసభ జాతీయ అధ్యక్షురాలైన రాజశ్రీ…. గత సోమవారమే తాను జ్ఞానవాపి మసీదు దగ్గర జలాభిషేకం చేస్తానని ప్రకటించారు. దీంతో స్థానిక అధికారులు ఆమెను జ్ఞానవాపి పరిసరాల్లోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.