News

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మ‌ళ్ళీ మోడీదే గెలుపు…. తాజా సర్వేలో వెల్లడి

268views

న్యూఢిల్లీ: దేశంలో లోక్‌సభ కు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మ‌ళ్ళీ బీజేపీ సార‌థ్యంలో ఎన్డీయే సర్కారు అధికారంలోకి వస్తుందని ఇండియా టీవీ-మ్యాట్రిజ్ సర్వే అంచనా వేసింది. బీజేపీ సార‌థ్యంలో ఎన్డీయేకు 362, కాంగ్రెస్ పార్టీ సార‌థ్యంలోని యూపిఏకు 97, ఇతరులు 84 స్థానాల్లో గెలుస్తారని వెల్లడించింది. రాష్ట్రాల వారీగా ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వేలో తేలింది. అనేక రాష్ట్రాల్లో బీజేపీ ముందుందని వెల్లడించింది. మొత్తంగా కేంద్రంలో బీజేపీ హ్యట్రిక్ ఖాయమని, మ‌ళ్ళీ మోదీ సర్కారు అధికారంలోకి వస్తుందని సర్వే తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి