310
భద్రాచలం: భద్రాచలం గుడి దగ్గర నీరు పూర్తిగా తొలగింది. గుడి కరకట్టను ఆనుకుని గోదావరి ఒడ్డునే ఉంటుంది. దీంతో వరద నీరు కాకుండా, ఇతరత్రా లీకేజీల వల్ల గుడి చుట్టూ నీరు చేరింది. భారీ మోటార్లతో ఆ నీటిని తోడారు. ఇవాళ ఉదయానికి గుడి పరిసరాల్లో నీరంతా పోయి సాధారణ వాతావరణం ఏర్పడింది.
మరోవైపు భద్రాచలం దగ్గర గోదావరి వరద బాగా తగ్గుతోంది. ఆది-సోమ వారాల్లో పై నుంచి ప్రవాహాలు పెరగడంతో కాస్త నెమ్మదించిన వరద ప్రవాహం, తిరిగి వేగంగా సముద్రం వైపు వెళ్ళడం మొదలైంది. బుధవారం ఉదయం ఏడు గంటలకు 49 అడుగుల నీటి మట్టం ఉంది భద్రాచలం దగ్గర. మరోవైపు భద్రాచలాన్ని కాపాడాలంటే చుట్టూ ఉన్న ఐదు గ్రామాలను ఆంధ్ర నుంచి తెలంగాణకు ఇవ్వాలంటూ టిఆర్ఎస్ కొత్త డిమాండ్ ముందు పెట్టింది.