News

హిజాబ్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన ఇరాన్ మహిళలు

923views

ఇరాన్‌: హిజాబ్ ప్రశ్నపై ఇరాన్ మండిపడుతోంది. హిజాబ్ వ్య‌వ‌హారంపై అక్కడ మహిళలు తుపాను సృష్టించారు. ఇప్పుడు మేము మా తలలను హిజాబ్‌తో కప్పుకోము అని గొంతు పెంచడమే కాదు, కఠిన శిక్ష పడుతుందన్న భయాన్ని మరచిపోయి, బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ లేకుండా తిరుగుతున్నారు. ఆ ఫొటోలు, వీడియోలను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇరాన్‌కు చెందిన వేలాది సోషల్ మీడియా హ్యాండిల్స్ ఈ వీడియోలను నిప్పులా వ్యాపింపజేస్తున్నాయి.

షియా ఆధిపత్యం ఉన్న ఇరాన్‌లో, హిజాబ్ ధరించాలనే చట్టపరమైన డిక్రీకి వ్యతిరేకంగా మహిళలు ముందుకొచ్చారు. వైరల్ అవుతున్న వీడియోల‌లో చాలా మంది మహిళలు తమ జుట్టును కప్పుకోకుండా చిత్రాలను రూపొందించడం, వారి ‘స్వేచ్ఛ’ను ఆనందంగా అనుభ‌విస్తుండ‌డం క‌నిపిస్తోంది. ఇప్పుడు ఇరాన్ మహిళలు తమ హక్కుల కోసం వీధుల్లోకి వచ్చారంటున్నారు. వారు హిజాబ్‌ చట్టాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు.

ఇరాన్ స్టేట్ న్యూస్ ఏజెన్సీ నుండి అందిన వార్తల ప్రకారం… మహిళలు హిజాబ్ తీసి షేర్ చేస్తున్న వీడియో పెను తుపానునే సృష్టిస్తున్నాయి. వారు ఇకపై ఈ ఇస్లామిక్ రిపబ్లిక్ కఠినమైన నిబంధనలను పాటించడానికి సిద్ధంగా లేరని సందేశం పంపుతున్నారు త‌మ వీడియోల్లో…

షియా పాలనలో ఉన్న ఇరాన్ చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తప్పనిసరిగా హిజాబ్‌తో తల కప్పుకోవాలనే నిబంధన విధించారు. ఈ ఆచారాన్ని మరింత బలోపేతం చేయడానికి, జూలై 12ని ‘హిజాబ్, పవిత్రత దినం’గా జరుపుకోవాలని అక్క‌డి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆగ్రహించిన మహిళలు హిజాబ్‌లు విప్పి రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సోషల్ మీడియాలో చాలా వీడియోలు షేర్ అయ్యాయి. అందులో పురుషులు కూడా మహిళల నిరసనకు మద్దతు ఇస్తున్నారు. హిజాబ్ చట్టానికి వ్యతిరేకంగా వారు తమ నిరసనను కూడా తెలుపుతున్నారు.

దీంతో ఆగ్రహించిన సంప్రదాయవాద ఇరాన్ ప్రభుత్వం పోలీసులను, భద్రతా బలగాలను రంగంలోకి దించి హిజాబ్‌ను అనుసరించాల్సిందిగా కోరింది. సైనికులు కూడా కఠినంగా వ్యవహరిస్తూ మహిళలను బలవంతంగా హిజాబ్ ధరింప‌జేయ‌డానికి ప్రయత్నిస్తున్నారు.

మ‌రోవైపు ఇరాన్ ప్రభుత్వం, ‘మనస్సును సరిదిద్దుకోవడం’ అవసరం అంటూ.. రాష్ట్ర టెలివిజన్ ఛానెల్‌లో హిజాబ్‌కు అనుకూలంగా వీడియోను ప్రసారం చేసింది. ఈ వీడియోలో 13 మంది మహిళలు ఆకుపచ్చ హిజాబ్, తెల్లని బట్టలు ధరించినట్టు చూపించారు. ఇది మాత్రమే కాదు, వారు ఖురాన్ శ్లోకాలు పఠిస్తున్నట్టు చూపబడింది. అయితే ప్రభుత్వం చేసిన ఈ విన్యాసానికి ప్రజలు కూడా మండిపడుతున్నారు. ప్రభుత్వ టీవీలో ఇలాంటి ప్రభుత్వ షోకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఘాటుగా తిట్టారు.

రానున్న రోజుల్లో హిజాబ్ వ్యతిరేక ఉద్యమం ఊపందుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తే ప‌రిస్థితి చేయి దాటిపోయే అవకాశం ఉందంటున్నారు. ఈ అంశంపై మహిళా సంఘాలు ఉద్యమిస్తున్నాయి.

Source:  Panchjanya

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి