259
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడానికి ముందు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ పర్వతారోహకులు రికార్డు సృష్టించారు. ఉత్తరాఖండ్ హిమాలయ పర్వత ప్రాంతంలో 22,850 అడుగుల ఎత్తున యోగా చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. 14 మందితో కూడిన ఐటీబీపీ పర్వతారోహకుల బృందం అబి గమిన్ పర్వత శిఖరాగ్రానికి చేరుకుంది.