News

రైల్వేట్రాక్‌లు పేల్చేందుకు పాక్ ఐఎస్‌ఐ కుట్ర

221views

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్ళ‌కు పాల్పడేందుకు పాకిస్థాన్ ఐఎస్‌ఐ పథకం రచించినట్టు నిఘా సంస్థలు తాజాగా హెచ్చరికలు జారీ చేశాయి. పంజాబ్ సహా దాని పొరుగు రాష్ట్రాల్లో సరకు రవాణా రైళ్ళ‌ను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్ళ‌ను జరపాలని కుట్ర పన్నినట్టు వెల్లడించాయి.

ఈ మేరకు ఐఎస్‌ఐ తమ మద్దతుదారులకు నిధులు కూడా పంపుతున్నట్టు, ఇలాంటి ఉగ్ర కార్యకలాపాల కోసం భారత్‌లోని పాక్ స్లీపర్ సెల్స్‌కు భారీ మొత్తంలో నగదు ఆఫర్ చేస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఖలిస్తాన్‌ ఉగ్రవాదులను కూడా దాడులకు ఐఎస్‌ఐ ఉసిగొల్పుతోందని నిఘా వర్గాలు సమాచారం అందించాయి. లాహోర్‌లో దాక్కున్న ఖలిస్తాన్‌ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిండాను ఇందుకోసం వాడుకుంటోందని వెల్లడైంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి