266
చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సును అడ్డగించి.. ప్రయాణికులను కిందకు దింపారు. అనంతరం ఆ బస్సుకు నిప్పుపెట్టారు. చింతూరు మండలం కొత్తూరు వద్ద ఈ ఘటన జరిగింది. దాంతో రహదారిపై అధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. మావోసుస్టుల దుశ్చర్యతో ప్రయాణికులు భయాందోళనకు గురైయ్యారు. దండకారణ్యం బంద్ పిలుపు దృష్ట్యా.. బస్సుకు నిప్పుపెట్టినట్టు సమాచారం.