311
భాగ్యనగరం: పొరుగు రాష్ట్రం తెలంగాణలో రాబోవు రోజుల్లో రైతులు, శ్రామికుల కోసం ప్రత్యేకంగా శాఖలను నిర్వహించనున్నట్టు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) ప్రాంత కార్యవాహ్ (తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి) కాచం రమేష్ వెల్లడించారు. విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు, వయోవృద్ధుల కోసం ఇన్నాళ్ళు తాము శాఖలను నిర్వహించగా, రాబోయే రోజుల్లో శ్రామికులు, రైతుల కోసం ప్రత్యేకంగా శాఖలను నడపనున్నామని చెప్పారు.
బర్కత్‌పురలోని కేశవనిలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ప్రాంత సహ సంఘచాలక్ (ఉపాధ్యక్షుడు) సుందర్‌రెడ్డిలో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 11 -13 వరకు గుజరాత్‌లోని కర్ణావతిలో నిర్వహించిన అఖిల భారత ప్రతినిధి సమావేశాల వివరాలను వివరించారు.
Source: Nijamtoday