News

త‌గ్గిన నక్సల్స్ హింస!

152views
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్ల‌డి

న్యూఢిల్లీ(భారతదేశం): నక్సల్ లేదా లెఫ్ట్ వింగ్ తీవ్రవాద(ఎల్‌డబ్ల్యుఇ) ఘటనలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి 2,258 నుంచి 77 శాతం తగ్గాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం లోక్‌సభకు తెలిపారు.

రాతపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ, పౌరులు, భద్రతా దళాల మరణాలు కూడా 85 శాతం తగ్గాయని, 2010లో ఆల్ టైమ్ గరిష్ఠంగా 1,005 నుండి 2021 నాటికి 147కి తగ్గాయని మంత్రి తెలిపారు.

న‌క్స‌ల్స్‌ ప్రభావితమైన జిల్లాలుగా పరిగణించబడుతున్న జిల్లాలను గత నాలుగేళ్లలో రెండుసార్లు సమీక్షించామని, 2018లో 126 నుండి 90కి, జూలై-2021లో 70కి తగ్గినట్టు మంత్రి తెలిపారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి