News

శుభ‌వార్త‌… ఆన్‌లైన్‌లో శ్రీరామ నవమి టికెట్లు

329views

భ‌ద్రాచ‌లం: రాములోరి భక్తులకు భద్రాచలం దేవస్థానం శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా రెండేళ్ళుగా సీతారాముల కల్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించిన అధికారులు ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

తెలంగాణలోని భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ రెండోతేదీ నుంచి 16 వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ నెల 10న జరిగే కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు సెక్టార్లుగా విభజించి నిర్దేశించిన టికెట్‌లను గురువారం నుంచి ఆన్‌లైన్‌లో పొందవచ్చని ఈవో శివాజీ ఒక ప్రకటనలో తెలిపారు.

రూ.7,500, రూ.2,500, రూ.2,000, రూ.1,000, రూ.300, రూ.150 విలువైన టికెట్‌లను ‌www.bhadrachalamonline.com అనే వెబ్‌సైట్‌ నుంచి తీసుకోవచ్చని వివరించారు. రూ.7,500 టికెట్‌కు మాత్రం కల్యాణ ఉభయ దాతలకు అనుమతి ఉంటుందని దీనిని నేరుగా ఆలయ కార్యాలయంలో కూడా తీసుకోవచ్చని వెల్లడించారు. ఏప్రిల్‌ 11న జరిగే పట్టాభిషేకం పర్వానికి సంబంధించి సెక్టార్‌ ప్రవేశానికి రూ.1,000 టికెట్‌ను ఆన్‌లైన్‌లో తీసుకోవాలని తెలిపారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి