News

కర్ణాటకలో ముదురుతున్న హిజాబ్ వివాదం

259views

బెంగళూరు: కర్ణాటకలో రేగిన‌ హిజాబ్ వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. ఉడిపి ఎంజీఎం కాలేజిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముస్లిం, హిందూ విద్యార్థులు పరస్పరం నిరసనలు తెలుపుతున్నారు. నెల రోజులుగా కర్ణాటకలో ఈ వివాదం నడుస్తోంది. ముస్లిం విద్యార్థుల డ్రస్ కోడ్‌కు పోటీగా హిందూ విద్యార్థులు కషాయం కండువాలు వేసుకుని వచ్చారు. దీంతో విద్యార్థులు రెండు వర్గాలుగా చీలిపోయి పోటా పోటీగా నినాదాలు చేస్తున్నారు.

Source: andhrajyothi

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి