
-
రజాబ్, హాజీ అబ్దుల్ మజీద్ అరెస్టు
ఉడిపి: కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో ముస్లిం యువతుల హిజాబ్ వివాదం కొనసాగుతూ ఉంది. ఈ వివాదం అంతా పెద్ద కుట్రలో భాగమేనంటూ సోషల్ మీడియా యూజర్లు చేస్తున్న ఆరోపణలు కొంతమేరకు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. హిజాబ్‌పై వివాదం కొనసాగుతున్న ఉడిపిలోని కళాశాల దగ్గర ఆయుధాలతో ఉన్న ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు.
నిందితులను రజాబ్, హాజీ అబ్దుల్ మజీద్‌గా పేర్కొన్నారు. వారిద్దరి నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు అనుమానితుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు దీనిపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ వ్యక్తులు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఎవరు పంపారు అనే దానిపై స్పష్టత లేదు.
హిజాబ్ వివాదానికి రెండు నెలల ముందు ఉడిపిలో వివాదం మొదలైంది. గోహత్యను హిందువులు వ్యతిరేకించారు. అక్టోబర్ 1, 2021న ఉడిపి తాలూకాలోని గంగోలిలో పశువుల దొంగతనం, గోహత్యకు వ్యతిరేకంగా హిందూ జాగరణ్ మంచ్ భారీ నిరసన చేపట్టింది.
ఈ నిరసనలో మత్స్యకారులు, చేపల వ్యాపారులు, మహిళలు సహా వేలాది మంది పాల్గొన్నారు. దీని తరువాత, ఆ ప్రాంతంలో నివసిస్తున్న ముస్లింలు గంగోలి మార్కెట్ నుండి చేపల కొనుగోలును బహిష్కరించారు. కొందరు వ్యక్తులు హిందూ చేపల విక్రేతల నుండి చేపలు కొనవద్దని ఇతర వ్యక్తులను ప్రేరేపించారు.
ఉడుపి, చిక్కమగళూరు ముస్లిం బాలికలు తరగతి గదిలో కూడా హిజాబ్స్ ధరించడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. శనివారం ఉడుపి కుందాపూర్‌లో కొందరు బాలబాలికలు కాషాయపు కండువాలు ధరించి ‘జై శ్రీరామ్’ నినాదాలతో ర్యాలీలు నిర్వహించారు. హిజాబ్ ఆంక్షలను వ్యతిరేకిస్తూ ఐదుగురు బాలికల తరపున పిటిషన్ దాఖలైంది. ఈ నెల ఎనిమిదోతేదీన పిటిషన్‌ను విచారణ చేపట్టనుంది హైకోర్టు.
Source: NationalistHub