News

మహారాష్ట్రలో నైట్‌ కర్ఫ్యూ!

363views
  • దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్

ముంబై: దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ ద‌డ పుట్టిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 17 రాష్ట్రాలకు పాకింది. మహారాష్ట్ర.. ఒమిక్రాన్‌కు సెంటర్‌ పాయింట్‌గా మారింది. దేశంలోనే అత్యధికంగా 108 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో మహారాష్ట్రలో నైట్‌ కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. మహారాష్ట్ర తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో 79 కేసులు, గుజరాత్‌లో 43 కేసులు వెలుగులోకొచ్చాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే సగానికి పైగా కేసులు వెలుగులోకొచ్చాయి.

తెలంగాణ‌లో…
తెలంగాణలో ఇప్పటివరకు 38 కేసులు నమోదయ్యాయి. అయితే, బాధితుల్లో 10మందికి నెగెటివ్‌ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. పాజిటివ్ వచ్చిన వారిని గచ్చిబౌలిలోని టిమ్స్, గాంధీ ఆస్పత్రులకు తరలించి ఐసోలేషన్‌ చేస్తున్నారు. కేసులెక్కువున్న ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు.

ఆంధ్రాలో నాలుగు కేసులు…
ఏపీలో నిన్న రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులతో ఏపీలో ఒమిక్రాన్‌ కేసులు నాలుగుకు చేరాయి. కోనసీమలో అయినవెల్లి మండలం నేదునూరిపాలెంకు చెందిన మహిళకు ఒమిక్రాన్‌ నిర్ధారణైంది. ఈనెల 19న కువైట్‌ నుంచి వచ్చిందామె. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఇదిలావుండ‌గా, ప్ర‌జ‌లు క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌పోతే ఫిబ్రవరి మూడు నాటికి థర్డ్‌ వేవ్‌ తీవ్రత మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించింది ఐఐటీ కాన్పూర్‌. ఈ నెల 15 నుంచే దేశంలో కేసులు పెరుగుతున్నాయని..కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే థర్డ్‌ వేవ్‌ వినాశకరమైనది కాదని వివరించింది.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి