
191views
-
దోషిగా తేల్చిన కోర్టు
తిరువనంతపురం: ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్(ఐసిస్)లో చేరిన 14 మంది కేరళ యువకుల కేసులో ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు నషీదుల్ హమ్జాఫర్ అనే నిందితుడిని దోషిగా తేల్చింది. కేరళలోని ఎర్నాకులంలో బుధవారం జరిగిన విచారణలో భాగంగా న్యాయస్థానం ఈ తీర్పును వెల్లడించింది. దోషికి విధించే శిక్షపై తదుపరి విచారణను కోర్టు ఈనెల 23కి వాయిదా వేసింది. కాసరగోడ్ జిల్లాకు చెందిన నషీదుల్ హమ్జాఫర్, రషీద్ అబ్దుల్లా, అష్ఫక్ మజీద్ సహా పలువురు నిందితులతో 2017 అక్టోబరు 3న విదేశాలకు వెళ్లిన హమ్జాఫర్ కాబుల్లో పట్టుబడ్డాడు. 2018 సెప్టెంబరులో ఎన్ఐఏ హమ్జాఫర్ను అరెస్ట్ చేసి భారత్కు తీసుకువచ్చింది.