
-
ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్
ఉత్తరాఖండ్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ మాట్లాడుతూ పెళ్ళి వంటి చిన్న కారణాలతో హిందూ యువతీయువకులు మతం మార్చుకోవడం సరికాదని అన్నారు. సొంత మతం, సాంప్రదాయాలపై యువతీయువకులకు గౌరవభావాన్ని నెలకొల్పాల్సిన అవసరముందన్నారు. మతం, సాంప్రదాయాలకు విలువ అన్నది ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. మన ఆచార వ్యవహారాలను అనుసరించాలని.. అంటరానితనం వంటి వాటిని వదిలిపెట్టాలని సూచించారు.
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానిలో ఆదివారం ఆర్‌ఎస్‌ఎస్ శ్రేణులనుద్దేశించి మోహన్ భగవత్ మాట్లాడుతూ హిందూ యువతీయువకుల మత మార్పిళ్లపై ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ యువతీయువకులు పెళ్ళి లాంటి కారణాలతో వ్యక్తిగత స్వార్థంతో హిందూ మతాన్ని వీడి మరో మతాన్ని ఎలా స్వీకరిస్తారని ప్రశ్నించారు. ఇలా చేయడం కరెక్ట్ అవునో కాదో మనస్సాక్షిని అడగాలని అన్నారు.
మన పిల్లలను ఆ రకంగా పెంచకూడదని.. కుటుంబ విలువలు, ఆచార సాంప్రదాయాలు తెలిసేలా, గౌరవించేలా పెంచాలని భగవత్ సూచించారు. మతమార్పిళ్లకు సంబంధించి ఎవరై ప్రశ్నిస్తే ఎలాంటి గందరగోళానికి గురికాకుండా ప్రజలు సమాధానం చెప్పాలన్నారు. వీటికి సరైన రీతిలో సమాధానాలు చెప్పేందుకు ప్రజలు కూడా తగిన విషయ పరిజ్ఞానం ఉండాలని అన్నారు.
సాంప్రదాయక కుటుంబ విలువలు, ఆచారాలను పరిరక్షించాల్సిన అవసరముందని.. ఇందుకోసం భారత పర్యాటక స్థానాలను సందర్శించడం చేయాలని అన్నారు. సాంప్రదాయక వస్త్రాలు ధరించడం నేర్పాలని మన సంస్కృతితో అనుసంధానమయ్యేందుకు భాష, ఆహారం, భక్తి పాటలు, వస్త్రధారణ, ఇళ్ళు వంటివి చాలా ముఖ్యమని భగవత్ అన్నారు.
Source: NationalistHub
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





