News

ప్రపంచమంతా ఇస్లాం చేయండి… ఓ ఐఏఎస్‌ అధికారి పిలుపు!

319views
  • పోలీసులకు ఫిర్యాదు, వారంలోగా నివేదిక కోరిన సీఎం యోగి

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి మహ్మద్‌ ఇఫ్తిఖరుద్దీన్‌ రూటు తప్పి ప్రవర్తిస్తున్నారు. ఓ ముస్లింల బృందాన్ని కలుసుకొని ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మతం వ్యాప్తి చేయమని ఉద్బోధిస్తున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని వీడియోలు బయటపడ్డాయి. ఈ అధికారి వ్యవహారంపై మఠం మందిర్‌ సమన్వయ కమిటీ జాతీయ ఉపాధ్యక్షుడు భూపేష్‌ అవస్థీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అప్పటి కాన్పూర్‌ జోన్‌ కమిషనర్‌ మహ్మద్‌ ఇఫ్తిఖరుద్దీన్‌ మతపరమైన కార్యక్రమాల వీడియోలను విడుదల చేస్తూ, ఇస్లామిక్‌ భావాలను అభిమానించడానికి, మతమార్పిడులను ప్రోత్సహించడానికి ఇఫ్తీఖరుద్దీన్‌ తన అధికారిక నివాసంలో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు అవస్థీ చెప్పారు. మహ్మద్‌ ఇఫ్తిఖరుద్దీన్‌ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌గా పనిచేస్తున్నారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మంగళవారం పోలీస్‌ కమిషనర్‌ అసీమ్‌ అరుణ్‌ను లక్నోకు పిలిపించారు. ఇఫ్తీఖరుద్దీన్‌ వ్యవహారంపై ఏడు రోజుల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించారు. దీంతో అంశంపై దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు.

మూడు భాగాలుగా తీసిన వీడియోలను కలిపి ఒక భాగంగా చేసి, యూట్యూబ్‌లో పెట్టినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఐఏఎస్‌ అధికారి ఎండీ ఇఫ్తిఖరుద్దీన్‌ కుర్చీపై కూర్చుని మాట్లాడుతున్నారు. సుమారు ఎనిమిది నుంచి పది మంది ముస్లింల బృందం నేలపై పరిచిన విలాసవంతమైన పరుపులపై ఆసీనులై ఉన్నారు. ‘ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ చెప్పండి. అతను(మహ్మద్‌) అందరికీ రసూల్‌ … మానవజాతికి చెప్పండి, మొత్తం మానవజాతి కోసం… ఈ పని(దవా) ఎవరు చేస్తారు? అల్లాను విశ్వసించే వారు. మిషన్‌ను ముందుకు తీసుకెళ్లండి. అతను అల్లా రాజ్యాన్ని స్థాపించాడు.

ఇది మొదట్లో అరబ్‌ (సౌదీ)లో స్థాపించబడిరది. కానీ అల్లా దీన్‌(విశ్వాసం) ప్రతిచోటా వ్యాపించవలసి ఉంది. అతని నిజాం(ఆర్డర్‌, సిస్టమ్‌) ప్రతి ఇంటిలో ప్రవేశించాలి. అది ఎలా చేరుకుంటుంది? ఈ పని చేయాలనుకునే మీలాంటి వ్యక్తుల ద్వారా. మీరు అలా చేయకపోతే, అల్లాప్‌ా మిమ్మల్ని పట్టుకుంటాడు.’ అని మాట్లాడినట్టు ఉన్నది.

ఇక, రెండవ భాగంలో… ఒక యువ ముస్లిం మిషనరీ అదే ఇంట్లో ఇఫ్తిఖరుద్దీన్‌తో సహా ఒక సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఇటీవల, పంజాబ్‌ నుండి ఒక వ్యక్తి ఇస్లాం మతం స్వీకరించాడు. మేము అక్కడ ముష్రిక్స్‌ (‘విగ్రహారాధకుడు’, బహుదైవారాధకుడు), ఇసైస్‌ (క్రైస్తవులు) మధ్య పనిచేస్తున్నప్పటికీ నేను అతనికి దవాప్‌ా(మతం మార్చడానికి ఆహ్వానం) ఇవ్వలేదు. మతం మారడానికి గల కారణాన్ని నేను అతనిని అడిగినప్పుడు, అతను తన సోదరి మరణం చెప్పాడు.

నేను వివరాలు అడిగినప్పుడు, అతని సోదరి మరణించినప్పుడు, ఆమె దహనం చేయబడిరదని అతను చెప్పాడు. ‘ఆమె బట్టలు కాలిపోయాయి, ఆమె నగ్నంగా ఉంది. ప్రజలు నా సోదరి నగ్నంగా మృతదేహాన్ని చూస్తున్నారు, ఇది నాకు సిగ్గుచేటు. నేను తట్టుకోలేక బయటకు వచ్చాను. నా కుమార్తె చనిపోయినప్పుడు కూడా అదే జరుగుతుందని, ప్రజలు ఆమెను నగ్నంగా చూస్తారని నేను అనుకున్నాను. ఇస్లాం కంటే మెరుగైన మతం మరొకటి లేదని నేను గ్రహించాను, నేను దానిని అంగీకరించాలి… అని అతను చెప్పినట్టు ఆ యువ ముస్లిం మాట్లాడారు.

చివర్లో అతను చేసే మత సాహిత్యం సూచన ఆసక్తికరంగా ఉంది. ఇది శివ ధర్మం, శివ ఉపాసన అనిపిస్తుంది. క్రైస్తవ మిషనరీలు జీసస్‌ సహస్రనామం వంటి వింతైన ఆవిష్కరణలతో చేసినట్టుగా మతమార్పిడి కోసం ఇస్లాం వాదులు కూడా హిందూ ధర్మాన్ని వక్రీకరించి స్వాధీనం చేసుకుంటున్నారా? గతంలో, కొందరు ముస్లిం మతాచార్యులు ‘శివుడు ఇస్లాం యొక్క మొదటి ప్రవక్త’ అని పవిత్రమైన వాదనను చేశారు. మరికొందరు శ్రీరాముడిని ‘ఇమామ్‌-ఇ-హింద్‌’ కు తగ్గించారన్న సూచనలు ఆశ్చర్యం, ఆందోళన కలిగిస్తున్నాయని అవస్థీ పోలీసులకు వివరించారు.

ముస్లిం విద్యార్థులకు ఐఏఎస్‌ కోచింగ్‌ అందించే సందేహాస్పద లింక్‌లతో జకాత్‌ ఫౌండేషన్‌ అనే ఇస్లామిస్ట్‌ ‘ఛారిటబుల్‌’ సంస్థ గురించి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ వివాదాస్పద వీడియో వెలుగులోకి వచ్చింది. జకాత్‌ ఫౌండేషన్‌ సభ్యుడు మౌలానా సిద్ధిఖీ ఇటీవల యుపి, ఇతర రాష్ట్రాలలో ప్రత్యేకించి హిందూ బాలికలను లక్ష్యంగా చేసుకుని విదేశీ నిధుల మార్పిడి రాకెట్‌కు నాయకత్వం వహించినందుకు అరెస్టయ్యారు.

Source: Hindu post

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి