News

జమ్మూ-కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

592views

జమ్మూ-కశ్మీర్‌: జమ్మూ-కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ సంఘటనలో ఒక ఉగ్రవాది మృతిచెందగా, మరొకరిని జవాన్లు సజీవంగా పట్టుకున్నారు. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్నేళ్లలో ఓ పాక్‌ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకోవడం ఇదే తొలిసారి. అయితే, అంతకుముందు 2008లో ముంబై ఉగ్రదాడిలో కసబ్‌ను సజీవంగా పట్టుబడ్డాడు. ఆ తర్వాత బాబర్‌ పాత్ర అనే టెర్రరిస్ట్‌ భారత భూభాగంలో చొరబడుతూ ఆర్మీకి చిక్కాడు.

తాజాగా మంగ‌ళ‌వారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో ఈ 19 ఏళ్ల ఈ టెర్రరిస్ట్‌ తాను లొంగిపోతానని, కాల్చి చంపవద్దని ఆర్మీని వేడుకున్నాడు. దేశంలో పండుగల వేళ భారీ విధ్వంసానికి కుట్రలు చేస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాకిస్తాన్‌ మద్దతున్న ఆఫ్గాన్‌ ఉగ్రవాదులను ఇప్పటికే నియంత్రణ రేఖ వద్ద నక్యాల్‌ సెక్టార్‌లో సిద్ధంగా ఉంచినట్టు గుర్తించారు.

వీరందరినీ పూంచ్‌ నదిలో నుంచి భారత్‌లోకి ప్రవేశపెట్టేందుకు శిక్షణ ఇస్తున్నారు. అంతేకాదు. లష్కరే తోయిబా, హర్కత్‌ ఉల్‌ అన్సార్‌, హిజ్బుల్‌ ముజాహుద్దీన్‌ సంస్థల కదలికలు కూడా పెరిగాయని నిఘా వర్గాల సమాచారం.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి