
447views
-
ఇద్దరికి గాయాలు
-
తిరుమలేశుని టికెట్ అమ్మకాల్లో వివాదం
తిరుపతి: తిరుమలేశుని భక్తుల నుంచి వసూలు చేసిన సొమ్మును వాటాలుగా పంచుకోవడంలో వచ్చిన తేడాలు దళారుల మధ్య కొట్లాటకు దారితీశాయి. డబ్బులు పంచుకునే క్రమంలో బ్రోకర్లు దాడులకు దిగారు. కొట్లాడుకున్నారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు చేర్చే విషయంలో దళారుల మధ్య విభేదాలు వచ్చినట్టు సమాచారం. ఈ గొడవల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. దీనిపై ఏవిఎస్ఓ శైలేంద్ర బాబు అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





